“తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన రైలు ప్రయాణానికి ప్రయాణికుల నుండి అనూహ్య ఆదరణ లభిస్తోంది; కవచ్ (Kavach) ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థను ప్రధాన మార్గాల్లో వేగంగా విస్తరిస్తున్నాము.”
సికింద్రాబాద్ / విజయవాడ (యువ 9 ప్రతినిధి): దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో నడుస్తున్న సికింద్రాబాద్–విశాఖపట్నం (20833/20834, 20707/20708) మరియు సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ కలిగిన ప్రీమియం రైళ్లలో అగ్రస్థానంలో నిలిచాయి. దీంతోపాటు స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' (Kavach) ఇన్‌స్టాలేషన్ పనులు ప్రధాన ట్రంక్ మార్గాల్లో వేగంగా జరుగుతున్నాయి.

