“రెండోసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఎంతో గర్వంగా ఉంది; భారత యువ క్రీడాకారులు ప్రపంచ వేదికపై అద్భుత విజయాలు సాధిస్తున్నారు.” — కోనేరు హంపి
విజయవాడ / విశాఖపట్నం (యువ 9 ప్రతినిధి): భారత చదరంగ చరిత్రలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. 2019లో తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ టైటిల్ గెలిచిన హంపి, న్యూయార్క్‌లో జరిగిన FIDE మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 8.5/11 పాయింట్లతో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచారు. డి. గుకేష్, అర్జున్ ఇరిగైసి, హారిక ద్రోణవల్లి వంటి క్రీడాకారులతో భారత చదరంగం ప్రపంచ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

