LIVE NEWS & VIDEOయువ 9 ప్రత్యక్ష వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలపై ధృవీకరించిన అధికారిక కథనాలు & వీడియో రిపోర్టులు.

పట్టణాలు - మేయర్ లు - వారి అధికారాలు: ప్రత్యక్ష ఎన్నికలు & నీతి ఆయోగ్ ఫ్రేమ్‌వర్క్ అసలు వాస్తవం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవి కేవలం ఉత్సవ విగ్రహమేనా? ఏప్రిల్ 25, 2026 నాటి నీతి ఆయోగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికైన మేయర్‌కు లభించే పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ అధికారాలు, 'మేయర్ ఇన్ కౌన్సిల్' క్యాబినెట్ వ్యవస్థపై సమగ్ర విశ్లేషణ.

ప్రచురణ: 20 అక్టో, 2026 12:45 PM•తాజా సవరణ: 20 అక్టో, 2026 12:45 PM•4 min read
పట్టణాలు - మేయర్ లు - వారి అధికారాలు: ప్రత్యక్ష ఎన్నికలు & నీతి ఆయోగ్ ఫ్రేమ్‌వర్క్ అసలు వాస్తవం ఏమిటి?
“గతంలో లాగా మేయర్ పదవి అనేది ఉత్సవ విగ్రహం కాదు. మేయర్ కి అపరిమితమైన అధికారాలు ఉండకపోవచ్చు కానీ అసలు అధికారం లేకపోవడం, కౌన్సిల్ అప్రూవల్ లేకుండా ఏమీ చేయలేనంత ఉత్సవ విగ్రహం లాగా ఉండటం అనేది వాస్తవం కాదు.”

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాలకు మేయర్లు, టౌన్‌లకి చైర్మన్ల ఎన్నికలు గతానికి భిన్నంగా ప్రత్యక్ష పద్ధతుల్లో నేరుగా ఓటర్లు ఓటు వేసి ఎన్నుకునే ప్రక్రియలో జరుగుతున్న సందర్భంలో, అసలు మేయర్లకి, చైర్మన్లకి ఉన్న అధికారాలు ఎంత? ఏమిటి? గతంలో లాగే ఉత్సవ విగ్రహాలు మాదిరిగానే ఉంటే ఈ పదవులకి ఇంత ఖర్చు, ఇంత హడావిడి ఎందుకు అనే చర్చ బలంగా జరుగుతుంది.

ఏ.బీ. వెంకటేశ్వరరావు విజయవాడ మేయర్‌గా పోటీ చేస్తున్న సందర్భంలో, అధికార తెలుగుదేశం పార్టీ నుంచే అసలు మేయర్లకి ఎటువంటి అధికారాలు ఉండవు, కౌన్సిల్ తీర్మానం లేకుండా వాళ్లు ఏమీ చేయలేరు అన్న వాదనను బలంగా వినిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇది నిజమా? అసలు వాస్తవం ఏమిటి అనేది ఈ ఆర్టికల్ సారాంశం.

నీతి ఆయోగ్ (NITI Aayog) ఫ్రేమ్‌వర్క్ & పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ అధికారాలు

ఏప్రిల్ 25, 2026 న NITI Aayog విడుదల చేసిన అధికారిక రిపోర్ట్ మరియు ఫ్రేమ్‌వర్క్ (Framework) ప్రకారం—10 లక్షలకు పైబడి జనాభా ఉన్న నగరాలకు మేయర్లకి డైరెక్ట్ ఎలక్షన్లు (ప్రత్యక్ష ఎన్నికలు) పెట్టమనేది నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు చేశారు. మేయర్ల డైరెక్ట్ ఎలక్షన్‌కి తమ ఫ్రేమ్‌వర్క్‌లో సిఫార్సు చేసిన నీతి ఆయోగ్ చేసిన ఇంకో కీలక రికమండేషన్ ఏమిటంటే: గతంలో పరోక్ష పద్ధతిలో ఎన్నికైన మేయర్ కి ఉన్న మొక్కుబడి పవర్ లా కాదు, ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన మేయర్ పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ హెడ్ (Executive Head) గా ఉండాలి అని స్పష్టం చేసింది.

గతానికి భిన్నంగా ఇక నుంచి కార్పొరేషన్ కమిషనర్ (IAS) డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన మేయర్ పర్యవేక్షణలో (Supervision) పని చెయ్యాలి, మేయర్ కి రిపోర్ట్ చెయ్యాలి అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం వెయిట్ చేసే పని లేకుండా నగర మున్సిపల్ శాఖకు సంబంధించిన నిర్ణయాలు పరిమితంగా అయినా 6 కోర్ సివిక్ సెక్టార్ల (6 Core Civic Sectors) విషయంలో మేయర్ నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పింది.

'మేయర్ ఇన్ కౌన్సిల్' (Mayor-in-Council) & 6 కీలక విభాగాలు

అలాగే ఎన్నిక అయిన తర్వాత మేయర్, ఎన్నికైన కార్పొరేటర్ల నుంచి కొందరిని తీసుకొని 15 రోజుల్లో "మేయర్ ఇన్ కౌన్సిల్" (Mayor-in-Council) అనే ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ (Executive Cabinet) ఏర్పాటు చేసుకొని క్రింది 6 కీలక విభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది:

•వాటర్ సప్లై (Water Supply - మంచినీటి సరఫరా)
•అర్బన్ ప్లానింగ్ (Urban Planning - పట్టణ ప్రణాళిక)
•శానిటేషన్ (Sanitation - పారిశుద్ధ్యం)
•వేస్ట్ మేనేజ్‌మెంట్ (Waste Management - వ్యర్థాల నిర్వహణ)
•ఫైర్ సర్వీసెస్ (Fire Services - అగ్నిమాపక సేవలు)
•లోకల్ ట్రాన్స్‌పోర్ట్ (Local Transport - స్థానిక రవాణా)

అలాగే వాటికి సంబంధించిన ప్రభుత్వ విభాగాలను డైరెక్ట్ కంట్రోల్‌లో ఉంచుకొని మేనేజ్ చేసే అధికారం కలిగి ఉంటారు అని చెప్పింది. ఇవన్నీ కాక బడ్జెట్ ఎలా ఖర్చు అవుతుంది అని లెక్కలు ఎప్పటికప్పుడు తెప్పించుకుని బడ్జెట్, లెక్కలు, లోపాలు చూసి బయట పెట్టే వెసులుబాటు ఉంటుంది.

ముగింపు: ఉత్సవ విగ్రహం కాదు

సో... గతంలో లాగా మేయర్ పదవి అనేది ఉత్సవ విగ్రహం కాదు. మేయర్ కి అపరిమితమైన అధికారాలు ఉండకపోవచ్చు కానీ అసలు అధికారం లేకపోవడం, కౌన్సిల్ అప్రూవల్ లేకుండా ఏమీ చేయలేనంత ఉత్సవ విగ్రహం లాగా ఉండటం అనేది వాస్తవం కాదు.

ఆధారాలు & ధృవీకరించిన మూలాలు

  • NITI Aayog Urban Governance & Direct Mayoral Election Framework (April 2026) (NITI Aayog / Municipal Administration Policy Brief)
    Verify

సంబంధిత కథనాలు

అమరావతి 'క్వాంటం వ్యాలీ': IBM, TCS, L&T భాగస్వామ్యంతో 156-క్యూబిట్ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్SPECIAL REPORT
0:58

అమరావతి 'క్వాంటం వ్యాలీ': IBM, TCS, L&T భాగస్వామ్యంతో 156-క్యూబిట్ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు

జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మరియు లార్సెన్ & టూబ్రో (L&T) సంస్థలతో కీలక భాగస్వామ్యం కుదిరింది.

4 min read
చదవండి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (122.9 కి.మీ) & 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ: వేగవంతమైన అనుమతులు, పాతబస్తీ కారిడార్ పనులు
తెలంగాణSPECIAL REPORT
2:15

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (122.9 కి.మీ) & 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ: వేగవంతమైన అనుమతులు, పాతబస్తీ కారిడార్ పనులు

హైదరాబాద్ మహా నగర విస్తరణలో భాగంగా ₹38,595 కోట్ల అంచనా వ్యయంతో 7 కారిడార్లలో 122.9 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైల్ ఫేజ్-2 కోసం కేంద్ర అనుమతులు మరియు NOC ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది.

5 min read
చదవండి